వేవ్స్ రిసొనెన్స్ వారి ఆధ్వర్యం లో శ్రీ బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం
- April 07, 2018దుబాయ్:ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ " విజయా ప్రొడక్షన్స్" వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ బి. నాగిరెడ్డి గారి సంస్మరణార్ధం ఏటా నిర్వహించే నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం ఈ యేడు దుబాయ్ లో ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియం లో జరిగింది.
ఉత్తమ చిత్రానికి గానూ పురస్కారం అందజేసే ఈ కార్యక్రమం నేటికి ఆరేళ్ళు పూర్తి చేసుకుని ఏడో యేట అడుగు పెట్టింది. విదేశీ గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇకపై పలు దేశాలలో జరుపుతామని విజయా అధినేతలు వెల్లడించేరు.
ఈ ఏటి ఉత్తమ చిత్రంగా " ఫిదా" ను గుర్తించి ఆ చిత్ర నిర్మాతయైన శ్రీ దిల్ రాజుగారికి ఈ పురస్కారం అందజేసేరు. బహుమతిగా జ్ఞాపికతో పాటు ఒకటిన్నర లక్షల రూపాయల నగదు ప్రదానం చేయడం జరిగింది.
దుబాయ్ లోనున్న వేవ్స్ రిసొనెన్స్ వారు శ్రీమతి గీతా రమేశ్ మరియూ రమేశ్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్వర్గీయ నాగిరెడ్డి గారి కుమారులు శ్రీ వేంకట రామి రెడ్డి, కోడలూ మరియూ విజయా ఆసుపత్రుల అధినేత్రి శ్రీమతి భారతి రెడ్డి గారు పర్యవేక్షించేరు. శ్రీమతి సుధ పల్లెం గారు ఈ కార్య క్రమానికి వ్యాక్యాతగా అలరించారు.
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేశ్చంద్ర గారి వాద్య, గాయక బృందం విజయా వారి పాటలతో ఆహూతుల వీనులకు విందు చేసింది. భారత దౌత్య వేత్త శ్రీమతి సుమతీ వాసుదేవన్ గారు ముఖ్య అతిధిగా వేంచేసిన ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనముతో ప్రారంభం కాగా శ్రీ నాగిరెడ్డి గారి విజయ విశేషాలను శ్రీ మాధవపెద్ది సురేశ్ గారూ, శ్రీమతి భారతీ రెడ్డిగార్లతో సహా పలువురు ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు.
అబూ ధాబీ వాస్తవ్యులు శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు మాట్లాడుతూ విజయా సంస్థ ప్రామాణికమైన సంస్థ అనీ ఆ సంస్థ వ్యవస్థాపకులు మానవాతీత ప్రజ్ఞా శాలియనీ, వారి యశశ్శు ఆచంద్ర తారార్కమనీ కొనియాడారు.
కార్యక్రమంలో భాగంగా స్థానిక నట్టువాంగనలు తమ నాట్యంతో ఆహూతులను అలరించారు.
శ్రీమతి సునీతా లక్ష్మినారాయణగారూ, సంక్షేమ కార్య దర్శి శ్రీమతి ఉమా పద్మనాభం గారూ, స్వప్నికా శ్రీనివాస్ గారూ, విశాలా మధుగారూ అలంకరించిన వేదికపై ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారికి పురస్కార ప్రదానం జరిగింది.
పురస్కార గ్రహీత శ్రీ దిల్ రాజు గారు మాట్లాడుతూ, ఇటువంటి పురస్కారం అందుకోవడం నా అదృష్టం, ఇటువంటి పురస్కారం అందుకోవాలంటే దుబాయే కాదు ప్రపంచంలో ఏమూలకైనా వెళతానన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!