గాజా సరిహద్దుల్లో పాలస్తీనియన్ల కాల్చివేత
- April 07, 2018
గాజా : ఇజ్రాయిల్-గాజా సరిహద్దులో శుక్రవారం ఇజ్రాయిల్ బలగాలు ఏడుగురు పాలస్తీనా ఆందోళనకారులను కాల్చిచంపారని, 200మంది గాయపడ్డారని గాజా మెడికల్ అధికారులు తెలిపారు. దీంతో గత వారం రోజులుగా సాగుతున్న నిరసనలు, ఆందోళనల్లో మృతిచెందిన వారి సంఖ్య 27కి చేరుకుంది. మృతుల్లో 16, 17ఏళ్ళ వయస్సున్న ఇద్దరు టీనేజీ పిల్లలు వున్నారని వారు తెలిపారు. 'ది గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' పేరుతో రోజువారీ సాగుతున్న ఈ ఆందోళనల సందర్భంగా శుక్రవారం హింసాకాండ చెలరేగడంతో వీరు మరణించారు.
గత శుక్రవారం నిరసనలు, ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దాదాపు 20వేల మంది పాల్గొన్నట్లు ఇజ్రాయిల్ మిలటరీ అంచనా వేసింది. వీరందరూ కూడా ఇజ్రాయిల్‌లోని తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. గాజా నుండి ఇజ్రాయిల్‌ను వేరు చేస్తున్న కంచెకు 65కిలోమీటర్ల దూరంలో శిబిరాలు వేసుకుని వీరు ఆందోళన నిర్వహిస్తున్నారు. 'మా వద్ద నుండి ఇజ్రాయిల్ ప్రతి ఒక్కటీ లాగేసుకుంది. మా మాతృభూమిని, స్వేచ్ఛను, మా భవితవ్యాన్ని వారు లాక్కున్నారు' అని ఆందోళనకారులు విమర్శించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!