సిరియా పై రసాయన దాడి..70 మంది మృతి
- April 07, 2018

సిరియాలోని తూర్పు ఘూటాలో జరిగిన అనుమానిత విషవాయువు దాడిలో 70 మంది ప్రజలు మరణించి ఉంటారని స్థానికులు, అధికారులు తెలిపారు. తిరుగుబాటుదార్ల ఆధీనంలోని చివరి నగరం దూమాపై రసాయన దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థ 'వైట్ హెల్మెట్' ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దాడికి గురైన ఓ బేస్మెంట్లో గుట్టలుగా పడివున్న మృతుల ఊహాచిత్రాలను ట్విటర్లో పోస్ట్ చేసింది.
అనంతరం, ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి, మృతుల సంఖ్య 150 అని మరో ట్వీట్ చేసింది.
మరోవైపు.. విష వాయువు దాడి ఆరోపణలను సిరియా ప్రభుత్వం ఖండించింది. ఇదంతా కట్టు కథ అంటూ కొట్టిపారేసింది.
అయితే.. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, విషరసాయన దాడి వాస్తవమైతే.. సిరియా ప్రభుత్వానికి మద్దతిస్తున్న రష్యా ఈ ఘటనకు బాధ్యత వహించాలని అమెరికా పేర్కోంది. ''విషరసాయనాల వాడకం రష్యాకు కొత్తేమీకాదు..! ఇప్పుడు సిరియాలో విష రసాయనాలను ప్రయోగించి, అనేకమంది ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఇందుకు రష్యా తప్పక బాధ్యత వహించాలి'' అంటూ అమెరికా ఘాటుగా స్పందించింది.
తిరుగుబాటుదార్లకు మద్దతు తెలుపుతున్న మీడియా కూడా ట్విటర్లో స్పందించింది. ఈ రసాయనదాడిలో దాదాపు వెయ్యి మందికిపైగా సిరియన్లు దుష్ప్రభావానికి లోనయ్యారని పేర్కొంది. గగనతల దాడిలో భాగంగా.. హెలీకాప్టర్ నుంచి ఓ బ్యారెల్‌ను కిందకు జారవిడిచారని, అందులో విషపూరిత 'సారిన్' రసాయనం ఉందని స్థానిక మీడియా ఆరోపించింది. ఇంతవరకూ తిరుగుబాటుదార్ల ఆధీనంలోని దూమా నగరాన్ని.. సిరియా ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







