కామన్వెల్త్ గేమ్స్: నాలుగో స్థానంలో భారత్
- April 07, 2018
కామన్వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుండటంతో పథకాల పట్టికలో భారత్ ఇప్పటివరకు టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో రోజు ముగిసే సరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 56 కేజీల విభాగంలో పి.గురురాజ రజత పతకం, 69 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం సాధించాడు. భారత వెయిట్ లిఫ్టర్లు సతీశ్ శివలింగం, వెంకట్ రాహుల్ భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు సాధించి పెట్టారు. మిజోరంకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను 53వ కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఇక మిరాబాయ్ చాను కూడా స్వర్ణం సాధించడంతో భారత్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
అయితే ఇక్కడ భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలు వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 57పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 32 పతకాలతో రెండో స్థానంలో ఇంగ్లండ్, 18 పతకాలతో కెనడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక భారత్ ఆరు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..