'భరత్ అనే నేను' ట్రైలర్
- April 07, 2018
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం ఎల్బి స్టేడియం లో జరిగింది. ముఖ్య అతిథిగా ఎన్.టి.ఆర్ రావడంతో ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచింది. ఇక మహేష్ అన్నా అంటూ తారక్ స్పీచ్ అదరగొట్టగా ఆ తర్వాత మైక్ అందుకున్న మహేష్ కూడా తారక్ తమ్ముడు అంటూ మెప్పించాడు.
ఇక సినిమా ట్రైలర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదగా రిలీజ్ అయ్యింది. ఓ సిఎం ప్రజలకు కూడా వ్యతిరేకంగా వారి బాగు కోసం ఎలా శ్రమించాడు అన్న కథే భరత్ అనే నేను. టీజర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ ఇంకాస్త అంచనాలను పెంచింది. సినిమా ట్రైలర్ చూస్తే ఈసారి మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.
శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఓ సిన్సియర్ సిఎం ఎలా ఉండాలో కొరటాల శివ చూపించబోతున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతుంది.
మహేష్ అమ్మగారు ఇందిర పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలన్ని బాగున్నాయి. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆమెకు డెబ్యూ మూవీ అవడం విశేషం.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







