శ్రీరెడ్డి ఇష్యూ పై స్పందించిన మా..

- April 07, 2018 , by Maagulf
శ్రీరెడ్డి ఇష్యూ పై స్పందించిన మా..

మా అసోసియేషన్ ముందు అర్థనగ్నంగా నిరసనగా చేసి, సంచలన ఆరోపణలు చేసిన సినీనటి శ్రీరెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మా సభ్యులు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు ఒక్క మాట కూడా నిజం కాదన్న మా అధ్యక్షుడు శివాజీ రాజా.. శ్రీరెడ్డికి కార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. బట్టలిప్పుకున్నందుకు కార్డు ఇస్తే.. అలా బట్టలు విప్పుకోవడానికి చాలా మంది వస్తారంటూ సంచలన విమర్శలు చేశారు శివాజీ రాజా. మా అసోసియేషన్‌లో సభ్యులెవరూ శ్రీరెడ్డితో నటించరని.. ఒకవేళ ఎవరైనా నటిస్తే.. వారిని కూడా సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారు. మా కార్డ్ కోసం దరఖాస్తును శ్రీరెడ్డి అసంపూర్తిగా ఇచ్చిందన్నారు సినీ నటుడు బెనర్జీ. సభ్యత్వం కోసం వచ్చినప్పుడు.. ఎవరిపైనా ఆరోపణలు చేయవద్దని చెప్పామని.. అయినా.. ఆమె హద్దుమీరిందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com