'టాక్సీ వాలా' మరో బాక్సాఫీస్ హిట్ అవుతుంది: విజయ్ దేవరకొండ
- April 08, 2018
టాలీవుడ్ లో సింగిల్ సినిమాతో టాప్ రేంజ్ కు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు ట్యాక్సీవాలాగా మారాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అటెంక్షన్ పెంచాడు. ఇంతవరకు ఓకే కానీ ఈ సినిమాని ఏకంగా 500 థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉందట ఆ ఫీల్మ్ టీం.
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ప్రజెంట్ ఈ హీరో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏళ్ల తరబడి వరుస సినిమాలతో సక్సెస్ లు సాధించి అలరిస్తే కానీ.. సంపాదించుకోలేని క్రేజ్ ను అర్జున్ రెడ్డి తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఈ హీరోకి చెందిన ఓ బ్యాక్ లాగ్ సినిమా రిలీజ్ అయినా.. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరి చూపు ట్యాక్సీవాలా పైనే ఫోకస్ అయింది.
ఇప్పుడు విజయ్ చూపంతా ట్యాక్సీవాలా పైనే ఉంది. గీతా ఆర్ట్స్2.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ మూవీకి రీసెంట్ గా ఫస్ట్ గేర్ అంటూ ఫస్ట్ లుక్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ కూడా విపరీతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటినుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కనీసం 500 థియేటర్లలో ట్యాక్సీవాలాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఓవర్సీస్ రిలీజ్ అదనం. ఇంత పెద్దఎత్తున విజయ్ దేవరకొండ మూవీని విడుదల చేయాలనుకోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జనరల్ గా చేస్తే విజయ్ దేవరకొండ సినిమాలు 300 నుంచి 400 థియేటర్లలో విడుదల అవుతాయి. కానీ ఈసారి ఈ కౌంట్ బాగా పెంచేస్తున్నారు. నిజానికి మేకర్స్ అంచనా ఇంకా ఎక్కువగానే ఉన్నా.. మే 11న విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రానికి ముందు.. అల్లు అర్జున్ నా పేరు సూర్య.. మహానటి విడుదలై థియేటర్లలో ఉంటాయి. అలాంటి పరిస్థితిలో 500 థియేటర్ల టార్గెట్ అందుకోవడమే కష్టం. అందుకే అక్కడ సెట్ అయిపోయారట. మరి విజయ్ ఈ సినిమాతో సమ్మర్ లో ఏ రేంజ్ లో సందడి చేస్తాడో వేచి చూడాలి మరి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..