వడ్డీ రేట్లను పెంచనున్న ఆర్బీఐ: మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్
- April 08, 2018
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ ఈ ఏడాది చివరి నుండి ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకటించింది. 2018 నాలుగో త్రైమాసికం నుండి వడ్డీ రేట్ల పెంపు సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది.
2018 నాలుగో త్రైమాసికం నుంచి వడ్డీరేట్ల పెంపు సీజన్ ప్రారంభమవుతుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలుపుతోంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల పరిధిలోనే ఉండే అవకాశం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.
గత కొద్ది త్రైమాసికాల నుంచి ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దీంతో వడ్డీరేట్లు అందుబాటులో ఉంటూ ఈఎంఐలు భారం కాకుండా ఉన్నాయి.
అయితే వడ్డీరేట్ల పెంపు శకం ప్రారంభమైతే రుణ కస్టమర్ల ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు పూనుకుంటుందని డచ్ బ్యాంక్ సైతం అంచనా వేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!