టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు స్వర్ణం
- April 09, 2018
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పంట పండుతోంది. టేబుల్ టెన్నిస్‌లో భారత్ టీం బంగారు పతకం సాధించింది. నైజీరియాతో జరిగిన ఈ పోటీలో భారత్ 3-0తో గెలిచింది. దీంతో భారత్ ఇప్పటి వరకు సాధించిన బంగారు పతకాల సంఖ్య 9కి చేరింది. ఒక్క టేబుల్ టెన్నిస్‌లోనే రెండు స్వర్ణాలు దక్కాయి. దీంతో మొత్తం భారత్ సాధించిన పతకాల సంఖ్య 18కి చేరింది. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ తరపున ఆడిన హర్మీత్ దేశాయ్, జ్ఞానశేఖరన్‌లు టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించారు. జ్ఞానశేఖరన్ తమిళనాడుకు చెందిన క్రీడాకారుడు కాగా హర్మీత్ దేశాయ్ గుజరాత్ క్రీడాకారుడు. సోమవారం ఒక్క రోజే భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







