ఫేక్ లోగోస్‌తో గ్యాస్ సిలెండర్స్: ఇద్దరి అరెస్ట్
- April 09, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఫేక్ లోగోస్‌తో గ్యాస్ సిలెండర్స్‌ని విక్రయించిన నేరానికిగాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమిరేట్స్ గ్యాస్ కంపెనీ లేబుల్‌ని తయారు చేసి, ఆ లోగోపై 35 గ్యాస్ సిలెండర్స్‌ని నిందితులు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. వీరిలో ఒకరు ట్రక్ డ్రైవర్ కాగా, మరొకరు సేల్స్‌మెన్. గ్యాస్ సిలెండర్స్‌ని తరలించేందుకు వినియోగించే రెండు ట్రక్స్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలెండర్స్‌ని తరలిస్తుండగా వీరిని ఎమిరేట్స్ గ్యాస్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు. అనుమానం వచ్చిన ఇన్‌స్పెక్టర్, ఫ్రోజెన్ మాంసాన్ని తరలించేందుకు ఉపయోగించే వాహనంలో నిందితులు గ్యాస్ సిలెండర్స్‌ని తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి, పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







