ఇబ్రి-యాంకుల్‌ రోడ్‌: 17 కిలోమీటర్ల సెక్షన్‌ ప్రారంభించిన ఎంఓటీసీ

- April 09, 2018 , by Maagulf
ఇబ్రి-యాంకుల్‌ రోడ్‌: 17 కిలోమీటర్ల సెక్షన్‌ ప్రారంభించిన ఎంఓటీసీ

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంఓటీసీ), ఇబ్రి - యాంకుల్‌ రోడ్‌కి సంబంధించి 17 కిలోమీటర్ల సెక్షన్‌ (సెకెండ్‌ స్టేజ్‌)ని ప్రారంభించింది.మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ ఇంజనీర్‌ సలీమ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ నౌమి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దహిరాహ్‌ గవర్నర్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ హిమియార్‌ అల్‌ మాలిక్‌ అల్‌ షుభి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖదాల్‌ ఏరియా - విలాయత్‌ ఆఫ్‌ ఇబ్రి నుంచి అల్‌ ఎక్దా ఏరియా - యాంకుల్‌ వరకు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించి వుంది. దహిర్‌ అల్‌ ఫవారిస్‌ రౌండెంబౌట్‌ నుంచి సయ్యా రౌండెబౌట్‌ వరకు మరో 7 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి వుంది. మొత్తం 34 కిలోమీటర్ల ఇబ్రి - యాంకుల్‌ రోడ్‌లో 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రారంభమయ్యింది. తొలి స్టేజ్‌లో 4.8 కిలోమీటర్ల రోడ్డు గతంలోనే ప్రారంభమయ్యింది. మొత్తం 10 రౌండెబౌట్స్‌, మూడు పెడెస్ట్రియన్‌ టన్నెల్స్‌ ఇందులో వున్నాయి. అల్‌ అరిధ్‌, ఖదాల్‌, మాజ్జె, అల్‌ మహియూల్‌, అల్‌ దువామ్రియా, సయ్యి ప్రాంతాలకు ఈ రోడ్డు ఉపయుక్తంగా వుంటుంది. దహిరాహ్‌ గవర్నరేట్‌ పరిధిలో టూరిజం, ట్రేడ్‌ మరియు సోషల్‌ మూమెంట్స్‌ ఈ రహదారి కారణంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com