నా భార్యను చూస్తే నాకు జలసీగా ఉంటుంది - సుకుమార్

- April 09, 2018 , by Maagulf
నా భార్యను చూస్తే నాకు జలసీగా ఉంటుంది - సుకుమార్

'రంగస్థలం' సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసాడు. తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ తన భార్యను మొదటిసారి ఒక సినిమా ధియేటర్ లో చూసి ప్రేమించిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తన భార్య అమాయకత్వం వల్ల తన ఇగో చాలాసార్లు దెబ్బతింది అంటూ నవ్వుతూ ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు.
 
గతంలో తాను తీసిన 'ఆర్య' సూపర్ సక్సస్ అయిన తరువాత ఆసినిమాను చూసిన తన భార్య ఈసినిమాకు డైరెక్టర్ గా 'నువ్వు ఏమిచేసావు' అని ప్రశ్నించినప్పుడు తన మైండ్ బ్లాంక్ అయిన విషయాన్ని బయటపెట్టాడు. 'కెమెరా మెన్ తీస్తాడు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఇస్తాడు ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు డైరెక్టర్ గా నువ్వు ఏమి చేస్తావు' అంటూ ఆమె తనను అడిగిన ప్రశ్నకు తన ఇగో హర్ట్ అయినా తాను తన భార్యను ఏమీ అనలేకపోయానని అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు సుకుమార్.
 
అంతేకాదు అనునిత్యం తాను సినిమా ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నా తన భార్య తన సినిమా విషయాలు పట్టించుకోదని తన భార్య పై సెటైర్ వేసాడు సుకుమార్. అంతేకాదు తాను దర్శకత్వం వహించిన '1 నేనొక్కడినే' ఫెయిల్ అయినప్పుడు తాను విపరీతమైన నిరాశతో ఉన్నప్పుడు తన భార్య తన దగ్గరకు వచ్చి అమెరికా వెళ్లి లెక్కల ట్యూషన్స్ చెప్పుకుంటే డబ్బులు బాగా వస్తాయట కదా అని అడిగినప్పుడు తాను ఏమనాలో తెలియక ఆశ్చర్యపోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు సుకుమార్.
 
ఇక తాను ఎన్నో అంచనాలు పెట్టుకుని కష్టపడి తీసిన 'రంగస్థలం' విడుదలకు ముందురోజు ఆసినిమా రిజల్ట్ గురించి టెన్షన్ పడుతూ నిద్రపట్టక తాను మేల్కొని ఉంటే ఈవిషయాలు ఏమీ పట్టించుకోకుండా హాయిగా ఆరోజు నిద్రపోతున్న తన భార్యను చూసినప్పుడు తనకు ఆశ్చర్యం కలగడమే కాకుండా ఆమె ప్రవర్తన తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు సుకుమార్. అయితే సమస్యల గురించి ఆలోచించకుండా హాయిగా రోజులు గడిపే తన భార్య మనస్తత్వాన్ని చూస్తే తనకు జలసీగా ఉంటుంది అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు సుకుమార్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com