గూఢచారిగా ఆలియా భట్

- April 09, 2018 , by Maagulf
గూఢచారిగా ఆలియా భట్

నటి ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజి'. మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 1971లో భారతీయ ఆర్మీకి గూఢచారిగా వ్యవహరిస్తున్న భారతీయ యువతి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అన్నదే ఈ సినిమా కథ. ప్రముఖ రచయిత హరీందర్‌ సిక్కా రచించిన 'కాలింగ్‌ సెహమత్‌' అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆలియా 'సెహమత్‌' పాత్రలో నటించారు. ఇందులో ఆలియాకు జోడీగా విక్కీ కౌశల్‌ నటించాడు. కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ చిత్రం మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com