అదిరిపోయే రేంజ్ లో రెడీ అవుతున్న 'సాహో'
- April 09, 2018
బాహుబలి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఫాంటసీ లాగా కనిపించబోతున్న ఈ మూవీకోసం ప్రభాస్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. బాహుబలి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయ్. అందుకే ఏమాత్రం తేడా రాకుండా చూసుకోవడానికి ప్రభాస్ రిచ్ గా ప్లాన్ చేస్తున్నాడు.
టాలీవుడ్ లో సాహో మూవీపై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే థర్డ్ షెడ్యుల్ కోసం భారీ సెట్ ని అబుదాబిలో ఏర్పటు చేసింది ఆ ఫీల్మ్ టీం. 20 నిమిషాల యాక్షన్ పార్ట్ కోసం 40 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి యూనిట్ సిద్ధమైందంటే ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. సాబు సిరిల్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలి సినిమా కోసం తను వేసిన భారీ సెట్టింగులు చూసి ప్రేక్షకలోకం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం సాబు సిరిల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకు పని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ మరో రెండు మూడు రోజుల్లో అబుదాబిలో జరగనుంది. ఇందుకు సంబంధించిన సెట్స్ కోసం సాబు సిరిల్ అండ్ టీమ్ గత నెలన్నర రోజులుగా అక్కడే పని చేస్తోంది.
సాహో మూవీ షూటింగ్ అబుదాబిలో ఎక్కడ చేయాలి, ఎలాంటి సెట్టింగులు వేయాలి అనే దానిపై గత ఆరు నెలలుగా సాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. అబుదాబిలో వివిధ ప్రాంతాలు పర్యటించింది. ఆరు నెలల్లో 8 సార్లు అబుదాబి వెళ్లి వచ్చాడట సాబు. అబుదాబిలో యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన సెట్స్ వేయడం కోసం 300 మంది టీంతో సాబు సిరిల్ నెలన్నర క్రితం అబుదాబి వెళ్లాడు. సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుంచి అబుదాబి తరలించారు. ప్రస్తుతం అక్కడ సెట్స్ వేస్తూ టీం మొత్తం బిజీ బిజీగా గడుపుతోంది.
సాహోలో సుమారు 20 నిమిషాల పాటు ఒళ్లు గగుర్పొడిచే ఫిక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందట. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆ స్టంట్ సీక్వెన్స్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. బైక్లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా ఉంటుందని టాక్. సినిమా షూటింగ్ ని ఈ ఇయర్ ఎండిగ్ కి పూర్తి చేసి నెక్ట్ ఇయర్... తెలుగుతో పాటు హిందీ, తమిళంలో రిలీజ్ చేయలనే ప్లాన్ లో ఉంది ఆ సినిమా యూనిట్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..