కంపెనీ మూసివేత, ఓనర్‌ అరెస్ట్‌

- April 10, 2018 , by Maagulf
కంపెనీ మూసివేత, ఓనర్‌ అరెస్ట్‌

మస్కట్‌: బౌషెర్‌లో లైసెన్స్‌ లేకుండా నడుస్తోన్న ఓ కంపెనీని మస్కట్‌ మునిసిపాలిటీ మూసివేసింది. ఓనర్‌ని అరెస్ట్‌ చేసినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పలు రకాలైన వాహనాల్ని విక్రించే ఆ కంపెనీ నిబంధనల్ని ఉల్లంఘించిందనీ, లైసెన్స్‌ లేకుండా విక్రయాలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ఓ ప్రకటనలో మస్కట్‌ మునిసిపాలిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. కంపెనీకి నోటీసులు పంపడంతోపాటు, యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. లైసెన్స్‌ లేకుండా ఎలాంటి కంపెనీలు నడపడానికి వీల్లేదని మునిసిపాలిటీ అక్రమార్కుల్ని ఉద్దేశించి హెచ్చరించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com