ఒమన్‌లో అగ్ని ప్రమాదం

- April 10, 2018 , by Maagulf
ఒమన్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: అల్‌ మాబెలా ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) ఫైర్‌ ఫైటర్స్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. పెను ప్రమాదం సంభవించకుండా ఫైర్‌ ఫైటర్స్‌ శ్రమించారని పిఎసిడిఎ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే రికార్డ్‌ సమయంలో సంఘటనా స్థలానికి ఫైర్‌ ఫైటర్స్‌ని పంపించినట్లు తెలిపిన పిఎసిడిఎ, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఓ ప్రకటనలో వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com