బహ్రెయిన్‌ చేరుకున్న మార్సెలో లిప్పి

- April 10, 2018 , by Maagulf
బహ్రెయిన్‌ చేరుకున్న మార్సెలో లిప్పి

మనామా: 2006 ఇటలీ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కోచ్‌ మార్సెలో లిప్పి బహ్రెయిన్‌ చేరుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఖాలిద్‌ అల్‌ హజ్‌, మార్సెల్లో లిప్పికి ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్‌ విభాగంలో మంచి వక్తగా పేరున్న మార్సెల్లో లిప్పి రాక తమకెంతో ఆనందంగా వుందని ఆయన తెలిపారు. ఫస్ట్‌ అరబ్‌ కాన్ఫరెన్స్‌ (స్పోర్ట్స్‌)లో మార్సెల్లో లిప్పి ప్రధాన స్పీకర్‌. ప్రస్తుతం చైనా నేషనల్‌ టీమ్‌కి మార్సెల్లో లిప్పి మేనేజర్‌గా వున్నారు. జులై 2004 నుంచి జులై 2006 వరకు ఇటలీ టీమ్‌కి ఆయన మెయిన్‌ కోచ్‌గా పనిచేశారు. 2016 ఎఫ్‌ఐఎఫ్‌ఎ టైటిల్‌ విజేతగా ఇటలీ నిలిచిన సంగతి తెల్సిందే. ఫుట్‌బాల్‌ హిస్టరీలో లిప్పి మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులందుకుంటున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com