పెళ్లి కానుకలని ఎం చేస్తారో చెప్పిన బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ

- April 10, 2018 , by Maagulf
పెళ్లి కానుకలని ఎం చేస్తారో చెప్పిన బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ

బ్రిటన్‌: బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ..ప్రముఖ హాలీవుడ్‌ నటి మేగన్‌ మార్కెల్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. మే 19న హ్యారీ, మార్కెల్‌ వివాహం బ్రిటన్‌లోని విండ్సర్‌ రాయల్‌ హౌస్‌లో జరగనుంది. అయితే పెళ్లి సమయంలో తమకు వచ్చే కానుకలన్నీ ఏడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని హ్యారీ, మేగన్‌ మార్కెల్‌ నిర్ణయించుకున్నారు.

వాటిలో ముంబయిలోని 'మైనా మహిళా' అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది. గతేడాది మార్కెల్ ఈ ఫౌండేషన్‌ను సందర్శించారు. అక్కడి మహిళలు చేసే పనుల గురించి తెలుసుకున్నారు.

ప్రిన్స్‌ హ్యారీ, మేగన్‌ తమ ఛారిటీని ఎంపికచేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుహాని జలోటా తెలిపారు. వారు అందించే సాయంతో తమ సంస్థను విస్తృతం చేసి మరికొందరు మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.

ప్రిన్స్‌ హ్యారీ ఎంపికచేసుకున్న ఛారిటీల్లో క్రైసిస్‌, స్కాటీస్‌ లిటిల్‌ సోల్జర్స్‌, స్ట్రీట్‌ గేమ్స్‌, సర్ఫర్స్‌ ఎగనెస్ట్‌ సివేజ్‌, చివా, ది వైల్డర్‌నెస్‌ ఫౌండేషన్లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com