ఇటలీలో 4.7తీవ్రతతో భూకంపం

- April 10, 2018 , by Maagulf
ఇటలీలో 4.7తీవ్రతతో భూకంపం

రోమ్: ఇటలీలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 4.7 తీవ్రతతో ఇటలీలో సంభవించిన ఈ భూకంపం కారణంగా స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

ప్రజలెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. మార్చి ప్రాంతంలోని మక్కాయాలో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించిందని తెలిపారు. భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారని చెప్పారు.

కాగా, 2016లో సంభవించిన భారీ భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ భూకంపం తీవ్రత 6.2ఉండటంతో సుమారు 300లకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com