శక్తిమంతమైన రైలింజన్ జాతికి అంకితం - మోదీ

- April 10, 2018 , by Maagulf
శక్తిమంతమైన రైలింజన్ జాతికి అంకితం - మోదీ

దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్‌ రైలింజన్‌నుబిహార్ లోని మాధేపురాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 12000 హర్స్‌పవర్‌ సామర్థ్యం గల ఈ విద్యుత్‌ రైలింజన్ మాధేపురాలోని విద్యుత్‌ రైలింజన్ల ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ రైలింజన్‌తో రష్యా, చైనా, జర్మనీ, స్వీడన్‌ లాంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఇంజిన్‌ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టామ్‌ సంస్థ సంయుక్తంగా మాధేపురాలో విద్యుత్‌ రైలింజన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com