బన్నీ కోసం 'అహం బ్రహ్మాస్మి'..
- April 10, 2018
గమ్యం, వేదం, కృష్ణం వందే జగత్ గురు, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. లాంటి విభిన్నమైన సినిమాలని తెలుగు ప్రేక్షలకు అందించిన దర్శకుడు క్రిష్. ప్రస్తుతం బాలీవుడ్ లో 'మణికర్ణిక' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ మళ్లీ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథని కూడా సిద్ధం చేసుకొన్నాడు. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ని కూడా ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఐతే, ఈ సినిమా ఏ టాలీవుడ్ స్టార్ తో తెరకెక్కించనున్నాడనే ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడీ ఉత్కంఠకు తెరపడినట్టు సమాచారమ్. క్రిష్ 'అహం బ్రహ్మాస్మి' కథని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కోసం రాసుకొన్నాడట. త్వరలోనే బన్నీని కలిసి కథని వినిపించబోతున్నట్టు సమాచారమ్. బన్నీ కథని ఓకే చేయడమే తరువాయి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో క్రిష్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ 'నా పేరు సూర్య'తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన 'నా పేరు సూర్య' మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









