బాలీవుడ్ లోకి అడుగిడనున్న రెజీనా
- April 10, 2018
సౌత్‌లో మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు కథానాయిక రెజీనా. సౌత్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్పై కన్నేశారు. అదేనండీ.. బాలీవుడ్ నుంచి కాలింగ్ అందుకుని షూట్లో జాయినైపోయారని బీటౌన్ టాక్. అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘1942: ఏ లవ్‌స్టోరీ’ సినిమా ఎంత హిట్ అయ్యిందో.. అందులోని ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ సాంగ్ అంతకు మించి ఫేమస్. ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్‌తోనే ఓ సినిమా రూపొందుతోంది.
షెల్లీ చోప్రా దర్వకత్వంలో అనిల్‌కపూర్, సోనమ్ కపూర్, రాజ్‌కుమార్ రావు, రెజీనా, జూహ్లీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’. ఈ సినిమా షూటింగ్లో రెజీనా జాయిన్ అయ్యారట. హిందీ చిత్రం ‘అన్కేన్’ సీక్వెల్ ‘అన్కేన్ 2’ తో రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారని అప్పట్లో వార్తలొచ్చినా కుదుర్లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..