దుబాయ్‌లో స్మార్ట్ ఎయిర్పోర్ట్ టన్నెల్ అతి త్వరలో
- April 10, 2018
దుబాయ్: దుబాయ్ ఎయిర్ పోర్&్ట్స, స్మార్ట్ టన్నెల్‌ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మే నెలాఖరుకు ఇది అందుబాటులోకి వస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ దుబాయ్‌లో పాస్‌పోర్ట్ కంట్రోల్‌కి సంబంధించి ఇది కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ టన్నెల్ ప్రయోగాత్మక దశలో వుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టన్నెల్ పనిచేస్తుంది. గత ఏడాది జిటెక్స్ టెక్నాలజీ వీక్‌లో ఈ స్మార్ట్ టన్నెల్‌ని ఆవిష్కరించారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఇందులో కీలకం. ప్రయాణీకులు ఏమీ చెయ్యకుండానే ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించొచ్చు. పాస్‌పోర్ట్‌ని చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కేవలం 10 సెకెన్లలోనే పని పూర్తి చేస్తుంది. టన్నెల్ ముందు ప్రయాణీకులు నిల్చుంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మిగతా పనులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత టన్నెల్ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..