17,000కి పైగా కమ్యూనికేషన్‌ ఫర్మ్స్‌లో ఉద్యోగాల సౌదైజ్‌డ్‌

- April 10, 2018 , by Maagulf
17,000కి పైగా కమ్యూనికేషన్‌ ఫర్మ్స్‌లో ఉద్యోగాల సౌదైజ్‌డ్‌

మక్కా: మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, 18,300 ఇన్‌స్పెక్షన్‌ టూర్స్‌ని మొబైల్‌ షాప్‌లలో కింగ్‌డమ్‌ వ్యాప్తంగా నిర్వహించింది. నేషనలైజేషన్‌ ఆఫ్‌ జాబ్స్‌ నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలెద్‌ అబాల్కైల్‌ మాట్లాడుతూ, 17,443 షాప్‌లు సౌదైజ్‌డ్‌ కాబడ్డాయనీ, 844 షాప్‌లు ఇంకా రెగ్యులేషన్స్‌ని పూర్తి చేయాల్సి వుందని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైన ఇన్‌స్పెక్షన్‌ టూర్స్‌ కొనసాగుతున్నట్లు వివరించారాయన. తనిఖీల సందర్భంగా 901 ఉల్లంఘనల్ని గుర్తించామనీ, సౌదైజ్‌ జాబ్స్‌కి సంబంధించి 592 ఉల్లంఘనలు, 309 ఇతర ఉల్లంఘనలు ఇందులో వున్నాయనీ ఆయన తెలిపారు. సౌదైజేషన్‌కి సంబంధించి పౌరులు కమ్యూనికేట్‌ చేయడానికి 19911 టోల్‌ ప్రీ నెంబర్‌ లేదా 'టుగెదర్‌ ఫర్‌ మానిటరింగ్‌' అనే అప్లికేషన్‌ని ఉపయోగించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com