అమెరికాలో భారతీయ కుటుంబ విషాదగాథ

- April 11, 2018 , by Maagulf
అమెరికాలో భారతీయ కుటుంబ విషాదగాథ

అమెరికాలోని కాలిఫోర్నియాలో వారం రోజుల కిందట మిస్సైన భారతీయ కుటుంబం కోసం చేపట్టిన గాలింపు విషాదాంతమయినట్టే కనిపిస్తోంది. సందీప్ తొట్టపిళ్లై కుటుంబం ప్రయాణిస్తున్న SVU వాహనం ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోవడంతో అతనితోపాటు భార్య, పిల్లలు కూడా చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఐతే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఇటీవలి భారీవర్షాలకు ఓ వాహనం ఏల్ నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంపై వెంటనే పోలీసులకు సమాచారం వచ్చినా, వరద ఉధృతి కారణంగా దాన్ని గుర్తించడం సాధ్యపడలేదు. అదే సమయంలో సందీప్ ఫ్యామిలీ మిస్సైనట్టు కంప్లైంట్ అందింది. ఆ ఫిర్యాదులో ఇదే కలర్, ఇదే మోడల్ వాహనంలో సందీప్ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండింటినీ పోల్చి చూస్తే, ఆ రోజు జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. 

ఏప్రిల్ 5న సందీప్‌ తన భార్య సౌమ్య, 12 ఏళ్ల కొడుకు సిద్దాంత్, 9 ఏళ్ల సాచీతో కలిసి పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్‌జోస్‌కు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారమైతే 6వ తేదీన వాళ్లు శాన్‌జోస్‌లో బంధువుల ఇంటి దగ్గర ఆగాలి. అక్కడి నుంచి తిరిగి కాలిఫోర్నియాలోని సొంత ఇంటికి చేరుకోవాలి. ఐతే.. వీళ్లు బయలుదేరిన రోజు కురుస్తున్న భారీవర్షాల వల్ల  వీళ్లు ప్రయాణిస్తున్న కారు, యూఎస్ హైవే 101పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మిస్టరీ ఛేదించేందుకు హైవే పెట్రోలింగ్ టీమ్ అదనపు బలగాల్ని కూడా రంగంలోకి దించింది. సందీప్ లాస్‌ఏంజిల్స్‌లోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. వారం రోజులయినా వాళ్ల ఆచూకీ తెలియకపోవడం పట్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. అటు, వారం కిందట సందీప్ తన కుటుంబంలో కలిసి ఇంటి నుంచి కారులో బయలు దేరిన దృశ్యాలు ఎదురింటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు బయలుదేరిన కొద్ది గంటలకు సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా మిస్సవడంతో వీళ్లు ప్రమాదంలో మృతి చెందినట్టే భావిస్తున్నారు. ఐతే, డెడ్‌బాడీస్ దొరకనందున అధికారికంగా ప్రకటన చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 

వారం రోజులుగా అచూకీ తెలియకపోవడం, కనీసం సెల్‌ఫోన్ కూడా ట్రేస్ కాకపోవడంతో మిస్సింగ్ కేసు ముందుకు కదలడం లేదు. సందీప్ తండ్రి బాబు సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదుతో అమెరికా పోలీసులు కేసు నమోదు చేసినా, మిస్టరీ ఛేదించేందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కి కూడా సందీప్ కుటుంబాన్ని కనిపెట్టేందుకు మరింత చొరవ తీసుకోవాలని అమెరికా అధికారుల్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com