గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్య
- April 11, 2018
ఇస్లామాబాద్ : గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్యకు గురైంది. ఈ సంఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని లార్కానా జిల్లా కంగా గ్రామంలో జరిగింది. వేదికపై పాడుతున్నప్పుడు ఓ వ్యక్తి తను చెప్పినట్లు చేయకపోవడంతో కోపంతో తన వద్ద నున్న గన్‌తో కాల్చి చంపాడు. ఈ సంఘటనతో అక్కడి వారందరూ ఉలిక్కిపడ్డారు. మృతురాలు సమీనా సామూన్ అలియాస్ సమీనా సింధు(24) ఆరు నెలల గర్భవతి అని ఆమె భర్త తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నిందితుడు తారిఖ్ అహ్మెద్ జాతోయ్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తారిఖ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..