ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం

- April 12, 2018 , by Maagulf
ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు, మరి కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే హోదా సాధన సమితి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న బంద్ జరపనున్నట్లు సాధన సమితి స్పష్టం చేసింది. ఈ బంద్‌కు వైసీపి, జనసేన పార్టీల మద్దతు కూడా లభించిందని తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com