సచిన్ జోషితో రవికుమార్ పనస ‘బిజినెస్ డీల్’

- April 12, 2018 , by Maagulf

హైదరాబాద్:సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్‌ జోషితో కలిసి, ఆర్‌కే మీడియా సంస్థ అధినేత రవికుమార్‌ పనస అసోసియేట్‌ అయ్యారు. సచిన్ జోషి అంటే, తెలుగులో ‘ఒరేయ్ పండు‘ తదితర సినిమాల్లో నటించిన బబ్లీ హీరో గుర్తుకొస్తాడు. అయితే, సినీ నటుడిగానే కాక, వ్యాపారవేత్తగానూ సచిన్ జోషి సుపరిచితుడు. పలు రకాలైన వ్యాపారాల్ని నిర్వహిస్తోన్న సచిన్ జోషికి, ఓ లిక్కర్ కంపెనీ కూడా వుంది. గోవా కింగ్స్ పేరుతో లభించే బీర్ చాలా ప్రత్యేకమైనది. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో వున్న ఈ బీర్ ప్రోడక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ గా తమకు అవకాశం లభించిందని రవికుమార్ పనస చెప్పారు. పీఆర్వో, అసిస్టెంట్ డైరెక్టర్, మూవీ ప్రమోటర్.. ఇలా సినీ పరిశ్రమతో వివిధ రకాలుగా అసోసియేట్ అయి వున్న రవికుమార్ పనస, తాజాగా లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతుండడం గమనార్హం. ఈ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి చాలామంది పోటీ పడినా, రవికుమార్ పనసతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం నేపథ్యంలో సచిన్ జోషి, ఆ అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. మల్టీ బిజినెస్ వింగ్ అనే ఆలోచనతో రవికుమార్ పనస వివిధ రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏ రంగంలోకి అడుగు పెట్టినా, అంతిమంగా ఆ రంగంలో విజయాన్ని అందుకోవాలన్న తపనే తనను ఇంతటివాడ్ని చేసిందని చెబుతున్నారాయన. జెెఎంజె గ్రూప్ అధినేత సచిన్ జోషికి మరోసారి థ్యాంక్స్ చెప్పారు రవికుమార్ పనస. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com