సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బిజిబిజీ
- April 12, 2018
సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజిబిజీగా ఉన్నారు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో సమావేశమై.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు చంద్రబాబు.
ఫస్ట్ హెచ్‌టీ- మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమ్మిట్‌లో చంద్రబాబును పరిచయం చేస్తూ ఆధునిక సాంకేతికతను పాలనలోప్రవేశపెట్టిన సీఎంగా, సంస్కరణవాదిగా అభివర్ణించారు నిర్వాహకులు. రాజధాని అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. సింగపూర్ మోడల్లో అన్ని హంగులతో కూడిన రాజధాని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని లేకపోవడం ఏపీకి అతి పెద్ద సంక్షోభమన్నారు. హైదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దామని. సైబరాబాద్ ను నిర్మించిన అనుభవం ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం బృహత్ ప్రణాళికను సింగపూర్ సర్కారే ఇచ్చిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సలెంట్ల ద్వారా రాజధాని ఆకృతులు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. మౌలిక వసతుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







