హౌతీ బాలిస్టిక్‌ మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్‌ ఫోర్స్‌

- April 12, 2018 , by Maagulf
హౌతీ బాలిస్టిక్‌ మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్‌ ఫోర్స్‌

రాయల్‌ సౌదీ ఎయిర్‌ ఫోర్స్‌, హౌతీ తీవ్రవాదులు యెమెన్‌ నుంచి సంధించిన బాలిస్టిక్‌ మిస్సైల్‌ని విజయవంతంగా కూల్చేశాయి. సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ ఈ వివరాల్ని వెల్లడించింది. అరబ్‌ కోలిషన్‌ ఫోర్సెస్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ టుర్కి అల్‌ మల్కి ఓ ప్రకటనలో సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, హౌతీ మిలిటెంట్స్‌ సంధించిన మిస్సైల్‌ని అత్యంత చాకచక్యంగా కూల్చేశారని పేర్కొన్నారు. యెమెనీ గవర్నరేట్‌ సాదా పరిధిలోని సాదా నుంచి జజాన్‌ వైపు ఈ మిస్సైల్‌ దూసుకొచ్చేందుకు యత్నించింది. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు మిస్సైల్స్‌ని సంధిస్తూ వుంటారు. ఇరాన్‌ నుంచి వారికి ఆయుధాల పరంగా సహాయం అందుతూ వస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com