మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి
- April 13, 2018
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే సంచలన ప్రకటనలు చేసిన శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్లో కొందరు వ్యక్తులు ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆరోపించింది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావు లక్ష్యంగానే శ్రీరెడ్డి ఈ కామెంట్లు చేసింది.
వాకాడ అప్పారావు వందలాది మంది మహిళా ఆర్టిస్టులను వేధించారని, 16 ఏళ్ల పిల్లలను కూడా వదిలి పెట్టలేదని ట్వీట్ చేసింది. చిరంజీవి పేరు చెప్పుకుని నీచమైన పనులు చేసే ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది. ట్వీట్‌కు వాకాడ అప్పారావు ఫొటోను సైతం శ్రీరెడ్డి జత చేయడం విశేషం. ఇప్పుడిది సంచలనంగా మారింది. అటు, రాంగోపాల్ వర్మ పట్ల శ్రీరెడ్డి పొగడ్తల వర్షం కురిపించింది. కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న తనకు ఇంతలా సపోర్ట్ ఇచ్చారంటే అది వర్మ ఒక్కరేనని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..