చిన్నారి ఘటనపై తీవ్రంగా స్పందించిన బాలీవుడ్

- April 13, 2018 , by Maagulf
చిన్నారి ఘటనపై తీవ్రంగా స్పందించిన బాలీవుడ్

గోవధ చేశారని చిన్నారి కుటుంబసభ్యులను అనుమానించిన దుండగులు.. బకర్వాల్‌ ముస్లిములను ఊళ్లోంచి తరిమేయాలని నిర్ణయించారు. ఆ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని 4 రోజులపాటు గుడిలో బంధించి ఒకరి తర్వాత మరొకరుగా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్రతో కొట్టి అతి దారుణంగా ఆమెను చంపేశారు. ఈ ఘటనపై బాలీవుడ్ తీవ్రంగా స్పందించింది. ‘‘మనం మనుషులమేనా..? పసిబిడ్డలపై కామాంధులు పైశాచికానికి తెగబడుతుంటే కళ్లు మూసుకొని కూర్చుందామా? ఏమైపోతోంది మన సభ్యసమాజం?’’ అంటూ నిగ్గదీసింది. ‘నా హృదయం ముక్కలైంది. 8 ఏళ్ల అసీఫానే కాదు.. మనందరి మనస్సాక్షిని చంపేశారు’ అని దియా మిర్జా ట్వీట్‌ చేశారు. ‘చిన్నారి అసీఫా అమాయకపు చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి’ అని అక్షయ్‌ పోస్టు చేశారు.ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అర్జున్‌కపూర్‌ దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల చిన్నారిని ఆ దుర్మార్గులు ఎంత క్రూరంగా హింసించారో..! స్పందించకపోతే మనం మనుషులమెలా అవుతాం?..’ అంటూ ఫర్హాన్‌ అక్తర్‌ ప్రశ్నించారు. ‘ఇదా నా దేశ దుస్థితి. నమ్మలేకపోతున్నాను’ అని సోనమ్‌ పోస్టు పెట్టారు. కఠువా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అసిఫా ఫొటోను అభిషేక్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడు మనమంతా ఒకటికాగలం అంటూ టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com