టి.కాంగ్రెస్ ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిక్సర్ల సిద్ధూ
- April 13, 2018
సిక్సర్ల సిద్ధూ తెలంగాణ కాంగ్రెస్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తాను కూడా కాంగ్రెస్ నేతనే అన్న విషయం మర్చిపోయి.. TRS ప్రభుత్వాన్ని తెగ పొగిడేశారు. ఇక్కడ అమలు చేస్తున్న ఇసుక పాలసీ భేష్ అంటూ కితాబిచ్చారు. 3 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన సిద్ధూ.. నిన్న జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ఇసుక రీచ్‌లను సందర్శించారు. అంతకుముందు ఇసుక ఆన్‌లైన్ విధానంపై TSMIDC అధికారులతో మాట్లాడారు. తర్వాత ఇసుక పాలసీ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు.
సిద్ధూ హైదరాబాద్‌లో చేసిన ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ నేతలకు షాకింగ్‌గా మారాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిద్ధూ.. ఇక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉందన్న విషయం మర్చిపోయి మాట్లాడడం వారికి మింగుడుపడడం లేదు. ప్రభుత్వ పాలసీలు అధ్యయనం చేసేందుకు మంత్రులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం సాధరణంగా జరిగేదే. ఐతే, ఇలాంటి పర్యటనకు వచ్చిన సిద్ధూ.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల్ని ముందుగా కలవకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ముందుగా స్థానిక PCC నేతలతో సమావేశమైతే ఇక్కడ ఇసుక పాలసీలోని అక్రమాలను వివరించే వాళ్లమని అంటున్నారు. ఒకే నంబర్‌పై 7 లారీలు తిరిగిన విషయం, వే బిల్లుల్లో మోసాల్ని ఆధారాలతో సహా సిద్ధూకు చూపించే వాళ్లమంటున్నారు. కానీ నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వాన్ని పొగడడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడ్డారు.
ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడడం ఇదే తొలిసారి కాదు. కర్నాటక మంత్రి రేవన్న ఆ మధ్య హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెర పథకం అద్భుతమన్నారు. మిగతా సంక్షేమ పథకాల్ని కూడా తెగ మెచ్చేసుకున్నారు. అప్పుడే ఉత్తమ్ కుమార్ టీమ్‌కి ఇది గొంతులో పచ్చివెలక్కాయలా పడింది. ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చిన సిద్ధూ కూడా TRSపై పొగడ్తల వర్షం కురిపించడం జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్ననే సిద్ధూ తీరుపై AICCకి కంప్లైంట్ కూడా చేశారు. ఐతే, ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టొద్దని సిద్ధూకు సమాచారం ఇస్తున్నట్టు ఢిల్లీ నుంచి సమాచారం అందింది. తీరా చూస్తే.. ఇవాళ ఆయన మీడియా ముందుకు వచ్చారు. TRS గవర్నమెంట్‌ను పొగిడారు. తాను తెలంగాణకు వచ్చింది భారత ప్రభుత్వ ప్రతినిధిగా అంటూ వ్యాఖ్యానించిన సిద్ధూ, తన పర్యటనను పూర్తిగా సమర్థించుకున్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







