శబ్ద కాలుష్యం: 626 మందికి జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- April 13, 2018
అబుదాబీ పోలీసులు, 626 వాహనాల్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనాలు అధిక శబ్దానికి కారణమవడంతోనే వాటిని సీజ్ చేసి, జరీమానాలు విధించామనీ, అలాగే 12 బ్లాక్ పాయింట్స్‌ని కూడా విధించామనీ పేర్కొన్నారు. 2018 తొలి క్వార్టర్‌లో పోలీసులకు పట్టుబడ్డ వాహనాల సంఖ్య ఇది. వాహన డ్రైవర్లకు 2000 దిర్హామ్‌ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ ఖలీఫా అల్ ఖయిల్ మాట్లాడుతూ, భారీ శబ్దాల కారణంగా వినికిడి శక్తి తగ్గుతుందనీ, అదే సమయంలో ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగిపోతాయని చెప్పారు. ఈ కారణంగా డ్రైవింగ్ బిహేవియర్‌లో తీవ్రమైన మార్పులొస్తాయని తద్వారా ప్రమాదాలు జరుగుతాయని ఆయన వివరించారు. యంగ్ డ్రైవర్స్ ఈ తరహా అతి ప్రవర్తనకు దూరంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రులు, స్కూల్స్ వద్ద శబ్దాన్ని చాలా తక్కువగా వినియోగించాలని సూచించారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..