తగ్గిన వెండి, బంగారం ధరలు
- April 13, 2018
అక్షయ తృతీయ సమీపిస్తున్ననేపథ్యంలో బంగారం ధరలుతీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం 200రూపాయలకు పైగా లాభపడిన పసిడి శుక్రవారం బలహీనపడింది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమ్మకాల తీవ్రతతో వెండి, బంగారం రెండూ కీలక స్థాయిలనుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా పసిడి నిన్నటి రూ. 32వేల మార్క్నుంచి కిందికి, వెండి కిలోధర 40వేల రూపాయల నుంచి దిగువకు చేరింది. ఏకంగా రూ.350 నష్టపోయి పది గ్రా. పసిడి 31,800వద్ద ఉంది. వెండి కూడా రూ.250 మేర బలహీన పడింది. విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి, ఈక్విటీ మార్కెట్ల లాభాలతో బంగారం ధరలు పడిపోయాయనీ, పెట్టుబడులు బంగారం నుంచి వెనక్కి మళ్లినట్టు ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 350 తగ్గి రూ. 3039,750 వద్ద ఉంది. 8 గ్రా. సావరీన్ గోల్డ్ రూ.100 క్షీణించి 24,800 వద్ద ఉంది. అలాగే వెండి కిలో ధర రూ. 250 తగ్గి రూ. 39,750 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. పది గ్రా.పసిడి 51 రూపాయలు లాభపడి 31,053 వద్ద ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా బంగారం ఔన్స్ ధర 1.37 శాతం క్షీణించి 1,334.30 డాలర్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!