జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్‌ జాతీయుడికి జైలు

- April 13, 2018 , by Maagulf
జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్‌ జాతీయుడికి జైలు
మనామా: ఫస్ట్‌ హై క్రిమినల్‌ కోర్టు, ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. జడ్జిని అవమానించడం, అలాగే పోలీస్‌ మేన్‌పై దాడి చేసినందుకుగాను ఈ శిక్ష ఖరారయ్యింది. 2017 నవంబర్‌ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్‌ జాతీయుడొకరు, జడ్జిని అవమానించాడు. సివిల్‌ కేసుకి సంబంధించి సెటిల్‌మెంట్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరో వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన నిందితుడు, చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోగా, న్యాయమూర్తిని నిందితుడు అవమానించడం జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు పోలీస్‌మేన్‌పైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో మరో ఇద్దరు పోలీస్‌మేన్‌, నిందితుడ్ని కంట్రోల్‌ చేసి, హ్యాండ్‌ కఫ్స్‌ వేసి, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com