రెండు తలల శిశువు.. అమ్మకు గుండె బరువు

- April 14, 2018 , by Maagulf
రెండు తలల శిశువు.. అమ్మకు గుండె బరువు

నవమాసాలు మోసి బిడ్డను కన్నది ఆ తల్లి. ఆ బిడ్డను చూసి భోరుమంది. అయ్యో భగవంతుడా నేను ఏంచేశాను. నాకు ఇలాంటి బిడ్డను ఇచ్చావు. ఎలా పెంచాలి అని రోదిస్తోంది. ఎందుకు ఇలాంటి బిడ్డను పుట్టించి నరకాన్ని చూపిస్తావు అని మనసులోనే దేవుడ్ని తిట్టుకుంది. భూమి మీద పడీ పడగానే ఎలాంటి బిడ్డనైనా బతికించే ప్రయత్నం చేస్తారు వైద్యులు. కానీ వారి ప్రయత్నాలు వృధా అయిన సంఘటనలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకవేళ బ్రతికినా కూడా నరకాన్నే చూడవలసి వస్తుంది. కారణాలు ఏమైతేనేం జన్యు లోపంతో బిడ్డ పుట్టింది అని డాక్టర్లు తేలుస్తారు. ఇలాంటి ఓ సంఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ పట్టణానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో జరిగింది. గురువారం ఓ మహిళ రెండు తలల మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్‌కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో కడుపులోని బిడ్డకు రెండు తలలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అతి కష్టం మీద శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఒకే శరీరానికి రెండు తలలతో పాటు రెండు గుండెలు, రెండు శ్వాసకోశాలు కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారికి ఎమర్జెన్సీ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com