కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
- April 14, 2018
డిజిటల్ లావాదేవీలను ఈజీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ 2016వ సంవత్సరంలో ఆవిష్కరించారు. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ 'భీమ్'. ఇప్పుడు భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. భీమ్ యాప్ ద్వారా మెదటి సారి రూ.100 లావాదేవీ జరిపినప్పుడు రూ.51 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా వినియోగదారులకు గరిష‍్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







