హెచ్-1 బి వీసాపై మోజు తగ్గిపోవటానికి గల కారణాలు
- April 14, 2018
హెచ్-1 బి వీసాపై మోజు తీరిపోతోందా?. అమెరికా వెళ్లాలనుకునేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందా?. అమెరికా అధ్యక్షుడు పెడుతున్న ఆంక్షలే అందుకు కారణమా?. అవుననే అంటున్నాయి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల లెక్కలు.
వరుసగా రెండో ఏడాది కూడా హెచ్-1బి వీసా కోసం అభ్యర్ధించే భారతీయుల సంఖ్య తగ్గింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అభ్యర్ధనల సంఖ్య 45 శాతం తగ్గిందని అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ సంస్థ వెల్లడించింది. 2017లో 3 లక్షల 99 వేల 349 అభ్యర్ధనలు రాగా.. ఇప్పుడు 3 లక్షల 36 వేల 107కు పడిపోయినట్లు వెల్లడించింది. 2018లో ఉద్యోగాలకు దాదాపు 1.90 లక్షల హెచ్-1బి వీసా దరఖాస్తులు అందినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
2018-19 సంవత్సరం కోసం అక్టోబర్ 1 నుంచి వీసాలు జారీ చేయనున్నారు. ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే గతేడాదితో పోలిస్తే H1-B వీసాల కోసం 8 వేల 902 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ 2018-19 సంవత్సరానికి అభ్యర్ధనల కోటాను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనుంది.
హెచ్-1బి వీసా కోసం జనరల్ కోటాలో పరిమితి 65 వేలు కాగా.. అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్స్‌గా అభివర్ణించే మాస్టర్స్ క్యాప్ కోసం పరిమితి 20 వేలు. ఇలా వచ్చిన అభ్యర్థనల నుంచి కొందరి దరఖాస్తులను కంప్యూటర్ జనరేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ పద్ధతిలో ఎంపిక జరగనుంది. ఇమ్మిగ్రేషన్ సంస్థ ప్రస్తుతం ఎంపిక కాని అభ్యర్ధనలను వారు కట్టిన ఫీజుతో పాటు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
తాజా వార్తలు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!