ఈ నెల 17 నుంచి రెండ షెడ్యూల్ లో "నివాసి"
- April 15, 2018
శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో నటించి అందరి హృదయాల్లో నటుడిగా మంచి స్థానం సంపాదించిన శేఖర్ వర్మ హీరోగా నివాసి మూవీలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో , వివియా, విద్య లు హీరోయిన్స్. సతీష్ రేగళ్ళ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.. గాయత్రి ప్రోడక్షన్స్, దత్తాత్రేయా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ లో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్. వర్మ లు ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే 75 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది చిత్ర.. ఇక ఈ నెల 17 నుండి రెండ షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. ఒక ఫ్యామిలి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. చరణ్-అర్జున్ సంగీత దర్శకులు. రెండు పాటలు, క్లైమాక్స్ మినహ మెత్తం చిత్రం పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ రేగళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమా లో శేఖర్ వర్మ చాలా ఎమెషన్ గా వుండే పాత్ర, అదీ కాకుండా చాలా చక్కగా నటించి అందర్ని మెప్పించాడు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ నటించిన జయసింహ చిత్రంలో చాలా చక్కటి పాత్రలో నటించి మెప్పించారు. నటుడుగా చాలా మంచి మార్కులు వేసుకున్న శేఖర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. చాలా చక్కటి ఎంటర్‌టైనర్ గా చేస్తున్నాము. అంతేకాదు మంచి ఫ్యామిలి ఎమెషన్ తో కూడిన థ్రిల్ కూడా ప్రేక్షకులు ఫీలయ్యేలా కథనం వుంటుంది. నిర్మాతలు కె.ఎన్.రావు , వర్మలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించడంలో సహయాన్ని అందిస్తున్నారు. 75% ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ , 2 పాటలు మినహ సినిమా పూర్తయింది. 17 నుండి రెండవ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇటీవల విడుదల చేసిన మెదటి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
బ్యానర్స్. గాయత్రి ప్రోడక్షన్స్ అండ్ దత్తాత్రేయా ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు.. శేఖర్ వర్మ, వివియా, విద్య, సుదర్శన్, జె.పి(తమిళ్), కొటేశ్వరావు తదితరులు
కొరియోగ్రఫి- భాను మాస్టర్, ప్రసాద్ మాస్టర్
మ్యూజిక్- చరణ్-అర్జున్
సినిమాటోగ్రఫి- కె.చిట్టిబాబు
ఆర్ట్- మురళి వీరవల్లి
పి.ఆర్.ఓ- ఏలూరు శ్రీను
ఎడిటింగ్- ప్రతాప్
స్టంట్స్- షయెలిల్ మల్లేష్
నిర్మాతలు- కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్ వర్మ
దర్శకత్వం- సతీష్ రేగళ్ళ
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..