కథువా చిన్నారి పై దయ చూపలేని సమాజం!!

- April 15, 2018 , by Maagulf
కథువా చిన్నారి పై దయ చూపలేని సమాజం!!

కథువా అత్యాచార బాధితురాలి అంత్య క్రియల విషయంలో స్థానిక గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. చిన్నారి మృతదేహం ఖననం చేయడానికి స్థలం కూడా ఇవ్వలేదని బాధితురాలి బంధువులు తెలిపారు. దీంతో 8 కిలో మీటర్ల దూరంలోని మరో గ్రామంలో చిన్నారి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. చిన్నారి బంధువులను ఖననం చేసిన చోటే పాప మృత దేహానికి శవ సంస్కారాలు చేయాలని ఆమె తండ్రి భావించాడు. కానీ ఆ స్థలం బక్రావల్‌ తెగకు చెందిన ఆ కుటుంబానిది కాదని వాదిస్తూ గ్రామస్థులు గొయ్యి తవ్వకుండా అడ్డుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com