`మెహబూబా` ప్రెస్ కాన్ఫరెన్స్
- April 15, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్‌లోను 'మెహబూబా' చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన దైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
సినిమా చూసిన దిల్ రాజు 'ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ఇది పూరి సినిమా అంటే' అని యూనిట్‌ని అప్రిషియేట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు రిలీజ్ కానున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత దిల్ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏప్రిల్ 15న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, పూరి కనెక్ట్స్‌లో ఒకరైన ఛార్మి కౌర్, హీరో ఆకాష్, హీరోయిన్ నేహాశెట్టి, కెమెరామెన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్, ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ, ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..