'మా' ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

- April 16, 2018 , by Maagulf
'మా' ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

హైదరాబాద్:'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్- ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద 'చలివేంద్రం' ప్రారంభమైంది. సీనియర్ నటి జమున ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్నిప్రారంభించారు.

అనంతరం జమున మాట్లాడుతూ, ''శివాజీరాజా, నరేష్ ఆధ్వర్యంలో

'మా' ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోంది. అన్నీ విజయవంతం అవుతున్నాయి. ఇప్పుడు వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ చలివేంద్ర ఏర్పాటు చేసి చల్లటి మంచినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం అదించడం చాలా సంతోషంగా ఉంది. నా చేతులు మీదుగా చలివేంద్రం ప్రారంభిచడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఏ కార్యక్రమం చేయడానికైనా డబ్బు అవసరం. కార్యక్రమం పెద్దదే..కానీ నేను ఇచ్చే డబ్బు చాలా చిన్నది(నవ్వుతూ)'' అన్నారు జమున.

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ''నరేష్‌, నేను ఒకే మాట..బాటలో వెళ్తున్నాం. ఇద్దరం కలిసి లవకుశలా పనిచేస్తున్నాం. ఈ ఏడాది ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఇది ఒకటి. విజయ్ చందర్ గారు ఓల్డేజ్ హోమ్‌కు రెండు ఎకరాల భూమి కూడా ఇచ్చారు. ఆ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి'' అని అన్నారు.

'మా' జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ, ''మా' సిల్వర్ జూబ్లి సంవత్సరంలో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ప్రతీ ఏడాది వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల దాహాన్ని ఎంతో కొంత తీరుస్తున్నాం. ఈ ఏడాది కూడా వాళ్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే ఏర్పాటు చేశాం'' అని అన్నారు. కార్యక్రమంలో

సీనియర్ నటి గీతాంజలి, విజయ్ చందర్, కాజా సూర్యనారాయణ, 'మా' జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, సి.గోవిందరావు, హరినాథ్, ఆర్.మాణిక్ తదితరలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com