మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో..

- April 16, 2018 , by Maagulf
మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో..

టాలీవుడ్ లో మెగా హీరోల  లిస్టు పెరిగిపోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ  నుండి  క్రికెట్  టీం అంతా నటులు టాలీవుడ్ ను  ఏలుతున్నారు. ఇప్పుడు   మరో మెగా  హీరో  ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టడానికి  రెడీ అవుతున్నట్టు  సమాచారం.  అయితే ఈ హీరో  మరెవరో కాదు  సాయిధరమ్ తేజ్  తమ్ముడు వైష్ణవ్ తేజ్.  గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు  వైష్ణవ్.  ఈ కుర్రాడికి సినిమాలో నటించాలనే ఆసక్తి ఉండడంతో  నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ల్లో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది.సాయి కొర్రపాటి నిర్మాతగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వైష్ణవ్  సినిమా  నిర్మించనున్నట్లు   టాక్ . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com