చెన్నైకి విమానాలు రద్దు చేసిన ఒమన్ ఎయిర్
- December 04, 2015
డిసెంబర్ 6 వరకూ చెన్నయ్‌కి విమానాల్ని రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ అధికారికంగా ప్రకటించింది. వరదలతో చెన్నయ్ ఇబ్బందులు పడుతుండడం విమానాశ్రయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో విమానాలు చెన్నయ్‌లో దిగే పరిస్థితులు లేవు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు రద్దయిన ప్రయాణాల్ని తిరిగి కొత్తగా ప్లాన్ చేసుకోవాలని ఒమన్ ఎయిర్ అధికారులు సూచించారు. టిక్కెట్లు పూర్తిగా రద్దు చేసుకోవాలనుకుంటే పూర్తిస్థాయిలో ఛార్జీలు రిఫండ్ చేయబడ్తాయనీ, ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండబోవమని ఒబమన్ ఎయిర్ ప్రకటించింది. ఒకవేళ భారతదేశంలో ఇంకో నగరానికి వెళ్ళాలనుకుంటే తగిన విధంగా ఛార్జీలు సరిచేయబడ్తాయనీ, ప్రయాణీకులకు చెల్లించాల్సిన సొమ్ముని నగదు రూపంలో లేదా వోచర్స్ రూపంలో చెల్లించబడ్తుందని ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







