దుబాయ్:స్వచ్ఛంద సేవకి అనుమతి తప్పనిసరి
- April 16, 2018
దుబాయ్:దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (సిడిఎ) నుంచి అనుమతి లేకుండా సంస్థలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని కొత్త చట్టం చెబుతోంది. వాలంటీర్లు టీమ్‌గా ఏర్పడి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నప్పుడు ఆయా టీమ్‌లు సిడిఎ డేటా బేస్‌లో రిజిస్టర్ అయి, అవసరమైన అనుమతులు పొందాల్సి వుంటుంది. అలా కాకుండా, ప్రకటనలు గుప్పించి, కార్యక్రమాలు చేపట్టడం ఇకపై కుదరదు. వాలంటీర్లు చేపట్టాలనుకున్న కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన భద్రతా చర్యల వివరాలు కూడా వెల్లడించాల్సి వుంటుంది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరకు ఓ చట్టాన్ని జారీ చేశారు. వాలంటరీ ప్రోగ్రామ్స్‌ని కో-ఆర్డినేట్ చేసే బాధ్యతను సిడిఎకి అప్పగిస్తూ ఈ చట్టంలో నిర్ణయం చేశారు. వాలంటీర్లకు ఐడెంటిఫికేషన్ కార్డులు మంజూరు చేయడం, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించడం, సంస్థలు వాలంటీర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వీలుగా సహకరించడం, వాలంటరీ కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్లను నామినేట్ చేయడం వంటివి సిడిఎ చేపడుతుంది. వాలంటీర్ల క్వాలిఫికేషన్, స్కిల్స్‌ని బట్టి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..