ఫేక్‌ ప్రైజ్‌: ఖోర్‌ ఫక్కాన్‌లో ఇద్దరి అరెస్ట్‌

- April 16, 2018 , by Maagulf
ఫేక్‌ ప్రైజ్‌: ఖోర్‌ ఫక్కాన్‌లో ఇద్దరి అరెస్ట్‌

ఖోర్‌ ఫక్కాన్‌:ఖోర్‌ ఫక్కాన్‌లో ఇద్దరు స్కామ్‌స్టర్స్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - ఈస్టర్న్‌ రీజియన్‌తో కలిసి ఖోర్‌ ఫక్కాన్‌ పోలీసులు ఈ నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఫోన్‌ ద్వారా, భారీ మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారంటూ అమాయకులకు నిందితులు వల విసురుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అమాయకులు వీరి మాటల్ని నమ్మి మోసపోతున్నారనీ, పెద్ద మొత్తంలో సొమ్ము దక్కించుకునేందుకు కొంత మొత్తం చెల్లించాలని నిందితులు కోరితే, బాధితులు నిజమేననుకుని డబ్బుని వారికి అందించి ఆ తర్వాత మోసం గురించి తెలుసుకుని విలపిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఖోర్‌ ఫక్కాన్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ మేజర్‌ సయీద్‌ ఖల్ఫాన్‌ అల్‌ నక్బి మాట్లాడుతూ, టెలి కమ్యూనికేషన్స్‌ ఉద్యోగిగా నిందితుల్లో ఒకరు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఫోన్లు, సిమ్‌కార్డుల్ని ఉపయోగించి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com