అబుదాబీ:హోదారియాత్‌ బ్రిడ్జిపై రోడ్డు పాక్షిక మూసివేత

- April 16, 2018 , by Maagulf
అబుదాబీ:హోదారియాత్‌ బ్రిడ్జిపై రోడ్డు పాక్షిక మూసివేత

అబుదాబీ:అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హోదారియాత్‌ బ్రిడ్జిపై ఏప్రిల్‌ 17 నుంచి 20 వరకు రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణ మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తం ఈ పాక్షిక మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పార్షియల్‌ క్లోజర్‌పై సోషల్‌ మీడియా ద్వారా వాహనదారులకు సమాచారం అందించడం జరిగింది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అధికారులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com