టూరింగ్ టాకీస్‌‌లో ఆకాష్ ప్రేమ గీతం

- April 16, 2018 , by Maagulf
టూరింగ్ టాకీస్‌‌లో ఆకాష్ ప్రేమ గీతం

నాన్న పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం మెహబూబా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్‌గా నేహ శెట్టి నటించిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. భాస్కర భట్ల అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయంటోంది చిత్ర యూనిట్. మే 11న మెహబూబాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లావణ్య సమర్పణలో  పూరీ జరగన్నాథ్ ప్రొడక్షన్ హౌస్ టూరింగ్ టాకీస్‌ నుంచి ఈ చిత్రం వస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com