రాత్రిపూట గల్లీ క్రికెట్ ఆడిన సచిన్
- April 16, 2018
ముంబై: సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు తన సేవలందించారు. తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి మార్గనిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
రిటైర్‌మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా సచిన్ ముంబై గల్లీలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్ చేశారు.
పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్ డివైడర్‌ని వాడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచ్‌ల్లో 2,334 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







